వనపర్తి, వెలుగు: వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న దృష్ట్యా జిల్లాలో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారని, నకిలీ విత్తనాల విషయంలో టాస్క్ ఫోర్స్ అధికారులు అలర్ట్గా ఉండి నకిలీ విత్తనాలు పంపిణీ చేసే వారిపై కేసులు నమోదు చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాలకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించాలన్నారు.
గత సీజన్లలో అత్యధిక మొత్తంలో యూరియా తీసుకున్న వారిని గుర్తించి వారు యూరియా దేనికోసం వినియోగిస్తున్నారు అనే అంశంపై తనిఖీ చేయాలని సూచించారు. రాబోయే విద్యా సంవత్సరంలో జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
